Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్లో చేరిక..!
మిర్యాలగూడ పట్టణంలోని 3వ వార్డుకు చెందిన ఖలీల్ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి సోమవారం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్లో చేరిక..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని 3వ వార్డుకు చెందిన ఖలీల్ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి సోమవారం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.
ALSO READ : Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్, ఖలీల్‌తో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం కోసం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఖలీల్ తెలిపారు.
ALSO READ : జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశం.. ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరపాలి..!
రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని నల్లమోతు భాస్కర్ రావు సూచించారు. 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకురావడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు.