జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశం.. ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరపాలి..!
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అదేశించారు.

జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశం.. ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరపాలి..!
మనసాక్షి, జగిత్యాల జిల్లా ప్రతినిధి :
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి కె. వై. ప్రసాద్ లతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత మాట్లాడుతూ
పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.
ALSO READ : డిజిటల్ క్రాప్ సర్వేతో పక్కాగా లెక్క.. రైతు భరోసాకు ఇదే ఫైనల్..?
అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 53 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా భవన్ (హైదరాబాద్) ముఖ్య మంత్రి ప్రజావాణి, జగిత్యాల జిల్లా ప్రజావాణికి సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు వచ్చే ప్రజావాణి వరకు పరిష్కరించాలని లేని యెడల దరఖాస్తుదారులకు తగిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
- Boxing : బాక్సింగ్ పోటీల్లో సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థినికి రజత పతకం..!
- Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!
- ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్.. మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే..!
- Karimnagar : రాఖీ పండుగ వేళ.. ప్రయాణికుల రద్దీపై ఆర్టీసీ ప్రత్యేక నిఘా..!









