హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

హామీల అమలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
గోదావరిఖని, మన సాక్షి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపి రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య తెలిపారు. ఈ మేరకు స్థానిక శివాజీ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ తో కలిసి సోమారపు లావణ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, ఫోర్ ట్వంటీ హామీలను, 13 డిక్లరేషన్ లను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు.
మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామని ఇకపై హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతుందని వెల్లడించారు. మోసపూరిత వాగ్దానాలు, ఫోర్ ట్వంటీ హామీలతో, పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోయిందని ఆరోపించారు.
ALSO READ : వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు.. భక్తుల్లో ఆందోళన..!
ఇక రామగుండం పాలన మాట దేవుడు ఎరుగుగాని, కూల్చి వేతలతో ప్రజలను మాత్రం భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటి నుండి బీజేపీ పార్టీ హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిరోజూ ప్రశ్నిస్తూనే ఉందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షులు ఐతే పవన్, మిట్టపల్లి సతీష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్, జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, జిల్లా మాజీ కార్యదర్శి జక్కుల నరహరి,
జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుజన శ్రీ, రజిత, చల్ల శోభారాణి, సీనియర్ నాయకులు దాసరి శ్రీనివాస్, మారపెల్లి శ్రీనివాస్,ఎతిరాజ్ సురేష్, బూడిద రమేష్, పంగ రవి, పొట్ల వెంకటేశ్ ,సిలివేరి అంజి, అరిగెల శ్రావణ్, అంకం తిరుపతి, మెరుగు శ్రీనివాస్, మంధిని మహేశ్, రోడ్డ శివ, తదితరులు పాల్గొన్నారు.









