Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య..!

మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.

Miryalaguda : మిర్యాలగూడలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య..!

మిర్యాలగూడ ఆగస్టు 31 మన సాక్షి

మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గా నగర్ కు చెందిన సైదమ్మ (39) ఆమె భర్త గణేష్ తో మద్యం సేవించే విషయంలో వివాదం జరిగింది.

కాగా ఇంట్లో మనస్థాపానికి గురైన సైదమ్మ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కాగా వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ సైదమ్మ సోమవారం మృతి చెందింది. మృతురాలి తల్లి పిట్టల జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు