Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

సర్పంచుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా బెజ్జం సాయి

హైదరాబాద్ లకిడికపూల్‌లోని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో దామరచర్ల మండలం దిలావర్‌పూర్ గ్రామ సర్పంచ్ బెజ్జం సాయిను నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నియమించారు.

సర్పంచుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా బెజ్జం సాయి

నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం నియామకం

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్ లకిడికపూల్‌లోని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో దామరచర్ల మండలం దిలావర్‌పూర్ గ్రామ సర్పంచ్ బెజ్జం సాయిను నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నియమించారు.

తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి బెజ్జం సాయికి నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవిలను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని, సర్పంచులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు.

ALSO READహైదరాబాదులో దారుణం.. హోటల్ గదిలో యువతి అనుమానాస్పద మృతి, పరారైన ప్రియుడు..!

నూతనంగా నియమితులైన నాయకులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని సర్పంచుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం సంఘం తరఫున సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

హృదయపూర్వక కృతజ్ఞతలు

నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా తనను నియమించిన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి కి, అలాగే తనపై విశ్వాసం ఉంచి మద్దతు తెలిపిన నల్లగొండ జిల్లా సర్పంచులందరికీ బెజ్జం సాయి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సర్పంచుల హక్కులు, సంక్షేమం మరియు గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని బెజ్జం సాయి తెలిపారు.

మరిన్ని వార్తలు