Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
హైదరాబాదులో దారుణం.. హోటల్ గదిలో యువతి అనుమానాస్పద మృతి, పరారైన ప్రియుడు..!
హైదరాబాదులోని మాదాపూర్ లో దారుణ ఘటన జరిగింది. హోటల్ గదిలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసి ప్రియుడు పరారయ్యాడు.

హైదరాబాదులో దారుణం.. హోటల్ గదిలో యువతి అనుమానాస్పద మృతి, పరారైన ప్రియుడు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హైదరాబాదులోని మాదాపూర్ లో దారుణ ఘటన జరిగింది. హోటల్ గదిలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసి ప్రియుడు పరారయ్యాడు. వివరాల ప్రకారం హైదరాబాదులోని మాదాపూర్ సిద్ధిక్ నగర్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. విశాఖకు చెందిన శారన్ నిఖిత (29) శ్రీనివాస రవితేజ ఇరువురు సోమవారం హోటల్లో దిగారు.
నిఖిత స్పృహ కోల్పోవడంతో రవితేజ, హోటల్ సిబ్బంది కలిసి కొత్తగూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా యువతి ముఖంపై స్వల్ప గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ప్రియుడు రవితేజ ఫోన్ స్విచాఫ్ చేసి పరారైనట్లు తెలుస్తుంది. పోలీసులు గాలిస్తున్నారు.
MOST READ :









