Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య..!
ఓ యువతకి పోలీస్ కానిస్టేబుల్ అర్ధరాత్రి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

యువతికి వీడియో కాల్ చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య..!
మన సాక్షి, హైదరాబాద్ :
ఓ యువతకి పోలీస్ కానిస్టేబుల్ అర్ధరాత్రి వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మలక్ పేట్ లో ముసారాబాద్ శాలివాహన నగర్ లో ఈ ఘటన జరిగింది.
కానిస్టేబుల్ చంద్రశేఖర్ (35) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి యువతకి వీడియో కాల్ చేసి తాను ఉరి వేసుకుంటున్నట్లు కానిస్టేబుల్ చెప్పాడు. దాంతో యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
చైతన్యపురి పోలీసుల సమాచారంతో మలక్ పేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ అప్పటికే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ మృతికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :









