Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునిజామాబాద్

ఆలూర్ లో విషాదం.. కరెంట్ షాక్ తగిలి యువకుడు దుర్మరణం..!

వ్యవసాయ భూమిలో కరెంటు తీగలు కిందకు వేలాడుతుండటంతో, ప్రమాదవశాత్తు వాటికి తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ఆలూర్ లో విషాదం.. కరెంట్ షాక్ తగిలి యువకుడు దుర్మరణం..!

ఆర్మూర్, మన సాక్షి

వ్యవసాయ భూమిలో కరెంటు తీగలు కిందకు వేలాడుతుండటంతో, ప్రమాదవశాత్తు వాటికి తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే… గగ్గుపల్లి గ్రామానికి చెందిన మాదరి అరుణ్ (31) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూనే, గ్రామానికి చెందిన జగదీష్ అనే రైతు వద్ద జీతగాడిగా ఉంటూ పొలం పనులు చూసుకుంటున్నాడు.

సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన అరుణ్‌కు, అక్కడ భూమికి అతి సమీపంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురైన అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అరుణ్‌కు భార్య కావేరి, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య గర్భిణిగా ఉంది. ఉన్నట్టుండి ఇంటికి ఆధారంగా ఉన్న అరుణ్ దుర్మరణం చెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

ALSO READNalgonda : నల్గొండ జిల్లాలో హైవేపై మంటల్లో కాలిపోయిన లారీ..!

అప్పటివరకు కళ్లముందే తిరిగిన వ్యక్తి శవమై పడిఉండటంతో గగ్గుపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. తీగలు కిందకు ఉన్నాయని తెలిసినా పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిండు ప్రాణం బలికావడానికి ఎవరి తప్పిదమే కారణమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు ఎస్సై రజినీకాంత్ తెలిపారు.

మరిన్ని వార్తలు