Chamarthi : చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా ముస్లిం లు చేరిక..!
రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్, 1వ వార్డులో ఆదివారం ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Chamarthi : చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా ముస్లిం లు చేరిక..!
రాజంపేట, మనసాక్షి :
రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్, 1వ వార్డులో ఆదివారం ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకులు సయ్యద్ ముజఫర్ అహ్మద్, ఎస్.జి. ఇనాయితుల్లా, ఎస్.ఎండి. కరీమ్ ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలను ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ALSO READ : Suryapet : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం..!
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ. గత వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కూటమి పాలనపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ALSO READ : గణేష్ నిమజ్జనం ముగించుకొని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి..!
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్, లీగల్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి అడపాల శ్రీనివాసులు, పట్టణ క్లస్టర్ ఇన్చార్జ్ రెడ్డయ్య నాయుడు, డాక్టర్ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు గుగ్గిళ్ళ చంద్రమౌళి, మైనార్టీ నాయకులు షామీర్ భాష, మాజీ సర్పంచ్ హబిబ్, సిరాజ్, మోసిన్ ఖాన్, ఫజురుల్లా, ముస్లిం మహిళలు, పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









