Miryalaguda : మిర్యాలగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ రోడ్డులోని విగ్నేశ్వర ట్రేడర్స్ పక్కన ఉన్న రేకుల షెడ్డులో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Miryalaguda : మిర్యాలగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..!
మిర్యాలగూడ మనసాక్షి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ రోడ్డులోని విగ్నేశ్వర ట్రేడర్స్ పక్కన ఉన్న రేకుల షెడ్డులో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో టూ టౌన్ పోలీసులు వెళ్లి విచారించగా మృతురాలు భిక్షాటన చేసేదని, అనారోగ్యం, మతిస్థిమితం లేదని స్థానికులు పేర్కొన్నారు. గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ALSO READ : గణేష్ నిమజ్జనం ముగించుకొని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి..!
మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చరిలో భద్రపరిచారు. సుమారు 80 నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉండటం, బూడిద రంగు గల దుస్తులు ధరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఎవరైనా తప్పిపోయినట్లుగా ఉంటే మిర్యాలగూడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని వారు కోరారు. మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సెల్ నెంబర్ 8712667749, పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ నెంబర్ 8712670150 కు తెలియజేయాలని వారు కోరారు.









