గణేష్ నిమజ్జనం ముగించుకొని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి..!
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నవాబ్ పేట్ లో శుక్రవారం రాత్రి గణేష్ ఉత్సవాలలో సంబరంగా వేడుకలు నిర్వహించుకుని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

గణేష్ నిమజ్జనం ముగించుకొని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి..!
మహబూబ్ నగర్,
(మనసాక్షి జిల్లా ప్రతినిధి – గోపాల్ )
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నవాబ్ పేట్ లో శుక్రవారం రాత్రి గణేష్ ఉత్సవాలలో సంబరంగా వేడుకలు నిర్వహించుకుని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌడాపూర్ గ్రామం మెట్టుగడ్డ తండ నుండి ఆనందంగా నిమజ్జనం వేడుకలు ముగించుకున్నారు.
అనంతరం శంషాబాద్ కారులో వెళుతుండగా రంగారెడ్డి జిల్లా పాలమాకుల సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో సీనియర్ నాయకులు లింబ్యా నాయక్ (55) మాజీ సర్పంచ్, జమున,(50) మాజీ ఎంపిటిసి మాన్ సింగ్(50) వసురం (48) , అక్కడికక్కడే ఓకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు.
కారు నడుపుతున్న డ్రైవర్ అశోక్(26) తీవ్రగాయపడి ఈ సంఘటన శనివారం హైదరాబాద్ వెళుతున్న వాహనదారులు చూసి పోలీసులకు సమాచారం తెలియజేయగా పోలీసులు వెంటనే ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అశోక్ అనే వ్యక్తి పరిస్థితి విషయంగా ఉన్నట్లు స్థానిక సమాచారం.
MOST READ :









