Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం.. ఒకరి మృతి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సిఐ సోమ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం..

Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం.. ఒకరి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సిఐ సోమ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి – నార్కట్ పల్లి బైపాస్ నందిపాడు క్రాస్ రోడ్డు వద్ద గురువారం అర్ధరాత్రి బొల్లెపల్లి వెంకటేశ్వర్లు బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయాడు. కారులో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న శ్రీనివాసరావు (36) గమనించి తన కారును రోడ్డు పక్కకు ఆపి 108కు సమాచారం అందించాడు.

క్షతగాత్రుని 108 వాహనంలోకి ఎక్కిస్తుండగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎల్పిజి గ్యాస్ టాంకర్ అతివేగంగా బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్ సైతం ఢీకొట్టింది. ఈ క్రమంలో శ్రీనివాసు రావు పైనుంచి లారీ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ALSO READUPI : యూపీఐ పేమెంట్స్ కు అలా చేస్తే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..!

సహాయం కోసం వెళ్తే ప్రాణం పోయింది :

శ్రీనివాసరావు ది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దుప్పలపూడి గ్రామం. అతడు భార్య అన్నపూర్ణ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరుతున్నారు. ఈ సంఘటన చూసి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని అంబులెన్స్ కు చెప్పి సహాయం చేయడానికి తన కారును ఆపి వెళ్ళాడు. సహాయం కోసం వెళ్లిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందడంతో అతని భార్య పిల్లలు బోరున విలపించారు.

ALSO READMiryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం.. ఒకరి మృతి..!

మరిన్ని వార్తలు