భువనగిరి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..!
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి భువనగిరి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.
భువనగిరి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..!
తుర్కపల్లి, మన సాక్షి :
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి భువనగిరి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ నం.138/2021 ప్రకారం, 2021 నవంబర్ 1న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ : యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య!
దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత ఆధారాలు సేకరించిన అనంతరం తుర్కపల్లి మండలం పెద్దతండా గ్రామ నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును ఎస్సీ నం.138/2022గా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు విచారించింది. కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు ధీరావత్ నవీన్ ను దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది ఎస్ ఐ శివకృష్ణ తెలిపారు.









