Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జెండావిష్కరణ చేసిన సర్పంచ్ నల్ల సుమిత రఘుమారెడ్డి

ప్రజా సంక్షేమ పాలన కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మల్లాడి పల్లి గ్రామ సర్పంచ్ నల్ల సునీత రఘుకుమార్ రెడ్డి అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల సందర్భంగా వారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జెండావిష్కరణ చేసిన సర్పంచ్ నల్ల సుమిత రఘుమారెడ్డి

చింతపల్లి, మనసాక్షి :

ప్రజా సంక్షేమ పాలన కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మల్లాడి పల్లి గ్రామ సర్పంచ్ నల్ల సునీత రఘుకుమార్ రెడ్డి అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల సందర్భంగా వారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 1948న నిజాం పాలన నుండి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది అన్నారు అందువలన ఈ చారిత్రక దినాన్ని ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా జరుపుతుంది అని సర్పంచ్ తెలిపారు.. అదే విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిచడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని అన్నారు.

తదనంతరం గ్రామ సభ నిరహించి గ్రామానికి సంబదించిన వివిధ సమస్యల,పై చర్చించి వాటి పరిష్కార మార్గాలపై సూచించడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం పౌరసరాఫరల లో ఎటువంటి లోపాలు జరగకుండా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్మార్ట్ రేషన్ కార్డు ను అమలులోనికి తెచ్చింది గ్రామ ప్రజలు ప్రభుత్వం అందించే స్మార్ట్ రేషన్ కార్డులను జాగ్రత్తపరుచుకొని సద్వినియోగపరచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు,కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల రఘుమారెడ్డి , డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్ ,పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, గ్రామ రెవెన్యూ అధికారి భాస్కర్ , ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు