Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. ఎమ్మెల్యే బాలు నాయక్

పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. ఎమ్మెల్యే బాలు నాయక్

చింతపల్లి, మన సాక్షి :

పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.
గురువారం మండల పరిధిలోని పోలేపల్లి–రాంనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల వనమైసమ్మ గుడి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై ఆయన మాట్లాడారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు వాతావరణ సమతుల్యత కాపాడబడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. చెట్లు గాలిలోని కాలుష్యాన్ని తగ్గించి, ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడంతో కార్యక్రమం పూర్తికాదని, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించి, అవి పెద్ద చెట్లుగా ఎదిగేలా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రతి గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే బాలునాయక్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటావత్ హరినాయక్, పోలేపల్లి రాంనగర్ సర్పంచ్ దొంతగోని యాదమ్మ, ఉప సర్పంచ్ రాజు, మైసమ్మ గుడి చైర్మన్ సిద్దగోని కృష్ణ గౌడ్, మాజీ ఎంపిటిసి మునుకుంట్ల శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ కొప్పుల జంగయ్య గౌడ్, కోడి దూటి శంకర్, నేనావత్ జవహర్ లాల్, నేనావత్ వసంత్ నాయక్, ఉప్పు శ్రీశైలం, కేతావత్ శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు