Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
నల్గొండ జిల్లాలో పురోహితులు సంచలన నిర్ణయం.. రేపు వినాయక పూజలు బంద్..!
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం గ్రామ పురోహితులు దత్తు ప్రసాద్ శర్మ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభ సమయంలో యజమానులు ఘర్షణ వాతావరణం ఒత్తిడి కారణంగా వినాయక పూజ నిర్వహిస్తూ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారు

నల్గొండ జిల్లాలో పురోహితులు సంచలన నిర్ణయం.. రేపు వినాయక పూజలు బంద్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం గ్రామ పురోహితులు దత్తు ప్రసాద్ శర్మ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభ సమయంలో యజమానులు ఘర్షణ వాతావరణం ఒత్తిడి కారణంగా వినాయక పూజ నిర్వహిస్తూ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారు . వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ మిర్యాలగూడ పట్టణంలో గురువారం ( 17 తారీకు) ఉదయం వేళల్లో వినాయక చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరగదని మిర్యాలగూడ బ్రాహ్మణ పురోహిత అర్చక సేవా సమాఖ్య కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఇందుకు వినాయక చవితి పందిళ్ళ కమిటీ మెంబర్లు అందరూ సహకరించాల్సిందిగా కోరారు.









