Miryalaguda : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన.. ప్రతి గణేష్ విగ్రహానికి రూ.5,016 ఆర్థిక సాయం..!
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి వినాయక మండపానికి బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

Miryalaguda : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన.. ప్రతి గణేష్ విగ్రహానికి రూ.5,016 ఆర్థిక సాయం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి వినాయక మండపానికి బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
వినాయక చవితి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి గణేష్ మండపానికి BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో రూ.5,016 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రకటించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు, ఉత్సవ కమిటీలకు ఆయన సూచించారు.
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలకృష్ణ, గుండు నరేందర్, నూకల వేణుగోపాల్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, దేశిడి శేఖర్ రెడ్డి, తలకొప్పుల సైదులు తదితరులు పాల్గొన్నారు.









