Suryapet : సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు..!
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న గణేశ మండపాన్ని జిల్లా ఎస్పీ నరసింహ సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Suryapet : సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు..!
సూర్యాపేట, మనసాక్షి :
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న గణేశ మండపాన్ని జిల్లా ఎస్పీ నరసింహ సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, మరియు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బంది అందరూ పరస్పరం సహకరించుకుంటూ ఐకమత్యంతో, సమన్వయంతో విధులు నిర్వహించాలని, ప్రజలకు విలువైన పోలీస్ సేవలను అందించడంలో ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మద్దూం అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, నారాయణ రాజు, జానయ్య, ఆర్ఎస్సైలు అశోక్, సాయిరాం తదితర పోలీస్ అధికారులు, పోలీస్ ఉత్సవకమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.











