Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

సూర్యాపేటలో దారుణం.. కొడుకుల వివాదం.. ఆగిన తల్లి అంత్యక్రియలు..!

సూర్యాపేటలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కొడుకులు వివాదం పడడంతో .. కన్నతల్లి అంత్యక్రియలు ఆగిపోయాయి ఈ ఘటనతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేటలో దారుణం.. కొడుకుల వివాదం.. ఆగిన తల్లి అంత్యక్రియలు..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేటలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కొడుకులు వివాదం పడడంతో .. కన్నతల్లి అంత్యక్రియలు ఆగిపోయాయి ఈ ఘటనతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

30 సంవత్సరాలుగా పెద్ద కుమారుడి వద్ద ఉంటున్న తల్లి చనిపోవడంతో చిన్న కుమారుడు తలకొరివి పెడతానంటూ తల్లి భౌతిక కాయాన్ని తన ఇంటికి తీసుకొచ్చుకొని తల్లి పేర ఫిక్స్డ్ చేసిన డబ్బుల లెక్క తేల్చాలంటూ అంత్యక్రియలు చేయకుండా వాగ్వాదం చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో ఆదివారం చోటుచేసుకుంది.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గూడూరు సరోజనమ్మకు ఇద్దరు కుమారులు కాగా 30ఏళ్ల నుంచి తన పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు వద్ద ఉంటుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆమె మరణించడంతో ఆమే అంత్యక్రియలను తానే చేస్తానంటూ చిన్న కుమారుడు రవికుమార్ తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు.

ALSO READసూర్యాపేటలో 30 మంది రౌడీ షీటర్ల బైండోవర్..!

ఆదివారం ఉదయం బంధువులు అంతా రాగ అంత్యక్రియలు చేయకుండా తన తల్లి 30 సంవత్సరాల క్రితం 4 లక్షల రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ చేసిందని ఆ డబ్బుల లెక్క తేల్చాలని వాగ్వాదం చేశాడు. ఈ విషయంలో పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు 30 ఏళ్లుగా ఆమెను మేమే చూసుకున్నామని డబ్బుల లెక్క ఏదైనా ఉంటే తర్వాత చేసుకుందాము ముందుగా తల్లి అంత్యక్రియలు చేయాలని చెప్పగా చిన్న కుమారుడు రవికుమార్ నిరాకరించాడు.

ALSO READరైతులకు బిగ్ అలర్ట్.. అందరూ ఇలా చేయాల్సిందే.. లేదంటే ప్రభుత్వ పథకాలు అందవు..!

బంధువులు సర్ది చెప్పడంతో పెద్ద కుమారుడి కుటుంబ సభ్యులు తామే తల్లికి అంత్యక్రియలు చేస్తామంటూ భౌతికకాయాన్ని తిరిగి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు బంధువులు తీసుకెళ్లి సద్దల చెరువు వద్ద అంత్యక్రియలు చేపట్టారు . తల్లి అంత్యక్రియలు చేసే విషయంలో డబ్బుల దగ్గర కుమారులు వాగ్వాదం చేసుకోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా తల్లి వద్దకు వెళ్లకుండా తల్లిని చూడకుండా చనిపోగానే ఇప్పుడు డబ్బుల కోసం పంచాయతీ పెడుతున్న చిన్న కుమారుడుని తప్పుపడుతున్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు