నల్గొండ జిల్లాలో విషాదం.. గణేష్ పూజలో గుండెపోటుతో పూజారి మృతి..!
నల్గొండ జిల్లాలో వినాయక చవితి రోజు తీవ్ర విషాదం నెలకొన్నది. గణేష్ పూజ నిర్వహించిన అనంతరం గుండెపోటుతో పూజారి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లాలో విషాదం.. గణేష్ పూజలో గుండెపోటుతో పూజారి మృతి..!
మన సాక్షి, తిరుమలగిరి సాగర్ :
నల్గొండ జిల్లాలో వినాయక చవితి రోజు తీవ్ర విషాదం నెలకొన్నది. గణేష్ పూజ నిర్వహించిన అనంతరం గుండెపోటుతో పూజారి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుమలగిరి సాగర్ మండలంలోని చింతలపాలెం గ్రామంలో గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న పూజారి దత్తు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు.
ALSO READ : Miryalaguda : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన.. ప్రతి గణేష్ విగ్రహానికి రూ.5,016 ఆర్థిక సాయం..!
అంతకుముందు గ్రామంలో తమ మండపంలో ముందుగా పూజ చేయాలని ఇరువురు యువకులు పూజారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. పూజ చేసిన అనంతరం పూజారి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు పూజారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా పూజారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









