Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కెసిఆర్ దే..!

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు ఆత్మగౌరవం, స్వయం పాలన కల్పించినందుకు కృతజ్ఞతగా ఈ నెల 17వ తేదీన తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన గ్రామాల్లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించనున్నట్లు మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.

Miryalaguda : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కెసిఆర్ దే..!

17న తండాల నుంచి కొత్త జి.పి లుగా ఏర్పడ్డ, అన్ని ఎస్టి గ్రామ పంచాయతీల్లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు ఆత్మగౌరవం, స్వయం పాలన కల్పించినందుకు కృతజ్ఞతగా ఈ నెల 17వ తేదీన తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన గ్రామాల్లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించనున్నట్లు మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో, మిర్యాలగూడలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల చిరకాల ఆకాంక్షను గుర్తించి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని భాస్కర్ రావు పేర్కొన్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో కెసిఆర్ హయాంలో మొత్తం 58 నూతన గ్రామ పంచాయతీలు మంజూరు కాగా, అందులో 40 తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, బీటి రోడ్లు, ఎస్ టి గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, గిరిజన గురుకుల పాఠశాలల భవనాలు, సంత్ సేవాలాల్ భవనం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించి గిరిజనుల అభివృద్ధికి కృషి చేసినట్లు భాస్కర్ రావు తెలిపారు.

“తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు ఆత్మగౌరవాన్ని కల్పించిన కెసిఆర్ కి కృతజ్ఞతగా 17వ తేదీన ప్రతి తండా గ్రామ పంచాయతీలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తాం. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కెసిఆర్ చేసిన కృషిని ప్రజలకు వివరిస్తాం” అని భాస్కర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తండా గ్రామ పంచాయతీలకు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గ గిరిజన నేతలతో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదుపరి ధనావత్ చిట్టిబాబు నాయక్ ఆద్వర్యములో పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీటి నిర్వహించి గిరిజన ప్రజలకు కెసిఆర్ ఏమేమి చేసారు వివరించారు..

కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి , దుర్గంపూడి నారాయణరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎండి యూసుఫ్, ధనావత్ చిట్టిబాబు నాయక్, ఆంగోతు హాతిరామ్ నాయక్ ,చౌగాని భిక్షం గౌడ్ , మట్టపల్లి సైదులు యాదవ్, దిరావత్ పాచు నాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, ధనావత్ బాలాజీ నాయక్ ,కుర్రా సేవియా నాయక్ ,నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ధనావత్ ప్రకాష్ నాయక్ డి పి ఎన్, చిర్రా మల్లయ్య యాదవ్, కుర్ర శ్రీను నాయక్, లావూరి శ్రీను నాయక్, పున్నా నాయక్ ,పీసీకే ప్రసాద్, రాయికింది సైదులు, ధనావత్ శంకర్ నాయక్, ధనావత్ వీరా నాయక్ ,

ధనావత్ సచిన్ నాయక్, నాగు నాయక్, శ్రీను నాయక్ , రామావత్ వినోద్ నాయక్, పల్సాని రాంరెడ్డి, పడిగపాటి సైదిరెడ్డి, మాలోతు బాలశంకర్ నాయక్, బాణావత్ సైదా నాయక్ ,ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, మాలావత్ రవీందర్ నాయక్, గాంధీ నాయక్, ఆడోతు లింగ నాయక్, బాలా నాయక్, ముని నాయక్ ,శ్రీను, దసరా నాయక్, సుధీర్ నాయక్, నడిగడ్డ హాతిరాం నాయక్, కృష్ణా నాయక్, సైదా నాయక్, అజ్మీర్ లింగా నాయక్, నాగు నాయక్, టక్కు రమేష్ ,శంకర్ నాయక్, మోహన్ నాయక్, సామిగాన్ తండా సైదా నాయక్, మాలోతు శ్రీను నాయక్, వాంకుడోత్ రాంబాబు నాయక్, ఆడోతు రవి నాయక్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు