ఏసీబీ భారీ ఆపరేషన్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ..!
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 2026 సెప్టెంబర్ 17 అర్ధరాత్రి చేపట్టిన ఈ దాడులలో కీసర సీఐ, ఎస్ఐ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.

ఏసీబీ భారీ ఆపరేషన్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ..!
మన సాక్షి, హైదరాబాద్ :
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 2026 సెప్టెంబర్ 17 అర్ధరాత్రి చేపట్టిన ఈ దాడులలో కీసర సీఐ, ఎస్ఐ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ దొరికినప్పటికీ కెమికల్ టెస్ట్ కు సహకరించకుండా ముప్పతిప్పలు పెట్టారు.
ఏసీబీ అధికారుల దాడుల్లో కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ ఐ జ్ఞానెందర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితుడి నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ వీరు ఏసీబీకి చిక్కారు. దాంతో ఎస్సై జ్ఞానేంద్ర రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ALSO READ : రైస్ మిల్లులో విజిలెన్స్ సోదాలు.. 6 వేల 26 బస్తాలు మాయం..!
10 క్వింటాళ్ల పిడిఎఫ్ రైస్ కేసు విషయంలో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు బాధితులతో 8.50 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 2వ తేదీన బాధితుల నుంచి మూడున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ సెప్టెంబర్ 17 అర్ధరాత్రి కీసర పెద్దమ్మ చెరువు దగ్గర 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఏసీబీ అధికారులను చూసిన ఎస్ఐ పారిపోయాడు. ఎస్సై, సీఐ ఇద్దరూ కూడా కెమికల్ టెస్ట్లు చేయించుకోకుండా ఇబ్బంది పెట్టినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.









