వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి..!
పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం నెలకొన్నది. నిమజ్జనం చేస్తుండగా చెరువు వింతలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.

వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి..!
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిగ్బ్రాంతి
పటాన్చెరు / (మన సాక్షి) :
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (మం) పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం నెలకొన్నది. నిమజ్జనం చేస్తుండగా చెరువు వింతలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.
విషాదం వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి నిమజ్జనం కోసం నేరేడుచెరువులో దిగి విద్యార్థులు మృతి మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తింపు. మృతులు నర్సింహ రాజు, సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్). గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్), ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్). శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్). సిద్దార్థ్ (టెన్ల్ క్లాస్) చెరువులో మట్టి కోసం తీసిన గుంతలు ఉండటంతో గమనించకుండా లోపలికి దిగిన విద్యార్థులు ఈత రాకపోవడంతో విగ్రహంతో సహా మునిగిపోయారు.
మృతి చెందిన విద్యార్థులు నర్సింహ రాజు, సుమంత్, గణేష్, ఉదయ్ కిరణ్, తేజ, సిద్దార్థ్ లుగా గుర్తింపు పటాన్ చెరులోని ప్రాచిన్ ఆస్పత్రిలో విద్యార్థుల మృతదేహాలు ఆస్పత్రిలో తోటి విద్యార్థులను అడిగి ఘటనపై ఆరా తీసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రాచిన్ ఆస్పత్రికి చేరుకున్న సైబరాబాద్ డిసిపి శ్రీనివాస్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని తెలియజేశారు.










