యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య!
సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిత్తారి హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద ఉన్న ఓ మల్టీప్లెక్స్ థియేటర్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య!
—కొబ్బరికాయల కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి.
–పాత కక్షలే కారణమా..?
–భార్య వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబుపై ప్రతీకార దాడి అని పోలీసుల అనుమానం.
నిజామాబాద్, ,మన సాక్షి
సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిత్తారి హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద ఉన్న ఓ మల్టీప్లెక్స్ థియేటర్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..
స్థానికుల కథనం ప్రకారం… గురువారం సాయంత్రం థియేటర్ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్దకు ముగ్గురు అపరిచిత వ్యక్తులు వచ్చారు. అక్కడ ఉన్న హరిబాబుపై ఒక్కసారిగా కొబ్బరికాయలు కోసే వేటకత్తులతో దాడికి తెగబడ్డారు. నడిరోడ్డుపైనే దారుణంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ALSO READ : ఏసీబీ భారీ ఆపరేషన్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ..!
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ రెండో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ ప్రకాశ్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
గతంలో నాలుగు నెలల గర్భవతిగా ఉన్న తన భార్య యూట్యూబర్ వైష్ణవి ని హరిబాబు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత కక్షలను మనసులో ఉంచుకునే ప్రత్యర్థులు ప్రతీకారంతో పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.