Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

చంపింది నేనే.. సెల్ఫీ వీడియో వైరల్..!

మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేనే హత్య చేశాను. యూట్యూబ్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా సెల్ఫీ వీడియోను సంతోష్ విడుదల చేశారు.

చంపింది నేనే.. సెల్ఫీ వీడియో వైరల్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేనే హత్య చేశాను. యూట్యూబ్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా సెల్ఫీ వీడియోను సంతోష్ విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకోసం అందరూ పోరాటం చేసి శిక్ష పడకుండా కాపాడాలని వేడుకున్నాడు. తనకు భార్య పిల్లలు ఉన్నారని ప్లీజ్ దండం పెడతా అంటూ సెల్ఫీ వీడియోలో సంతోష్ వేడుకున్నాడు.

ALSO READఏసీబీ భారీ ఆపరేషన్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కీసర సీఐ, ఎస్ఐ..!

నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తాలో హరిబాబును హత్య చేసిన సంతోష్ పోలీసుల ఎదుట వెళ్ళిపోయాడు. తనకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అనుకున్నానని కానీ, న్యాయం చేయలేదని అందుకే తాను ఇలా చేశానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మీ కాళ్లు మొక్కుతా.. మీకు దండం పెడతా.. ప్లీజ్ నన్ను త్వరగా బయటకు తీసుకురండి అని వేడుకున్నాడు.

మరిన్ని వార్తలు