Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Madgulapally : మాడుగులపల్లిలో పెను ప్రమాదం.. ప్రయాణిస్తుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ..!
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తుండగా ఎలక్ట్రిక్ స్క్యూటీ పేలింది.

Madgulapally : మాడుగులపల్లిలో పెను ప్రమాదం.. ప్రయాణిస్తుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ..!
మాడుగులపల్లి, మన సాక్షి
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తుండగా ఎలక్ట్రిక్ స్క్యూటీ పేలింది. వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం తోపుచెర్ల గ్రామానికి చెందిన పర్సనబోయిన మధు శుక్రవారం ఎలక్ట్రిక్ స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కుక్కడం సమీపంలో ఒక్కసారిగా వాహనం నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన మధు వెంటనే స్కూటీని ఆపి దిగి పక్కకు వెళ్లాడు. కొద్దిసేపటికే స్కూటీ ఒక్కసారిగా పేలడంతో భారీగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
మధు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ నాణ్యత, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని పలువురు సూచిస్తున్నారు.









