Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

రైతులకు బిగ్ షాక్.. అలా చేయకుంటే బ్యాంకు ఖాతాల్లోకి రూ.6000 రానట్లే..!

కేంద్ర ప్రభుత్వం రైతులకు బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్రం రైతు ఖాతాలలో ఏడాదికి మూడుసార్లు రెండు వేల రూపాయల చొప్పున నిధులు జమ చేస్తుంది.

రైతులకు బిగ్ షాక్.. అలా చేయకుంటే బ్యాంకు ఖాతాల్లోకి రూ.6000 రానట్లే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం రైతులకు బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్రం రైతు ఖాతాలలో ఏడాదికి మూడుసార్లు రెండు వేల రూపాయల చొప్పున నిధులు జమ చేస్తుంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి.

అయితే ఈ పథకం కింద 24వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ – నవంబర్ మాసం మధ్యలో ఈ నిధులు విడుదల కాబోతున్నాయి. పీఎం కిసాన్ నిధులు అసలైన రైతులకు అందించేందుకు అనర్హులను ఏరి వేసేందుకు కేంద్రం ఫార్మర్ రిజిస్ట్రీ తీసుకొచ్చింది. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేసుకోవాల్సి ఉంది.

అయితే పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు పడాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకుని ఐడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పీఎం కిసాన్ పథకం తో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలన్నీ కూడా ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ తో లింకు చేయబడి ఉంటాయి. అందుకు రైతులంతా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు