జిల్లా వార్తలునల్గొండపండుగలు
రావులపెంటలో” వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు..!
మండలంలోని రావులపెంట గ్రామంలో శ్రీవిఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

రావులపెంటలో” వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు..!
వేములపల్లి, మన సాక్షి:
మండలంలోని రావులపెంట గ్రామంలో శ్రీవిఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.శుక్రవారం ఐదో రోజు వేద పండితుల నడుమ స్వామివారి పూజా మహోత్సవం కమనీయంగా సాగింది.
ALSO READ : Madgulapally : మాడుగులపల్లిలో పెను ప్రమాదం.. ప్రయాణిస్తుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ..!
ఈ సందర్భంగా మహిళలు స్వామివారి ముందు దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో భజన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రివేళ గణేష్ దగ్గర మహిళలు, చిన్నారులు భజనలు, చప్పట్లతో సందడి చేశారు.










