Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు

వినాయక ఉత్సవాల్లో ఘనంగా ముగ్గుల పోటీలు, లడ్డూ వేలంపాట

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని కర్నాల వీధిలో కొలువుదీరిన శ్రీ వినాయక స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి.

వినాయక ఉత్సవాల్లో ఘనంగా ముగ్గుల పోటీలు, లడ్డూ వేలంపాట

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని కర్నాల వీధిలో కొలువుదీరిన శ్రీ వినాయక స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూ ప్రసాద వేలంపాట ఉత్సాహంగా సాగింది.

ALSO READ : పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. దానం నాగేందర్ పై అనర్హత వేటు..!

వంట మాస్టర్ పి.సుబ్రహ్మణ్యం స్వామివారికి లడ్డూను భక్తితో సమర్పించారు. లడ్డూ వేలంపాట రూ.1,016తో ప్రారంభం కాగా, భక్తుల పోటీ మధ్య ప్రముఖ వ్యాపారవేత్త పి.రవిచంద్రబాబు రూ.9,116లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ప్రతి ఏడాది లడ్డూ వేలంపాటలో రవిచంద్రబాబు లడ్డూను గెలుచుకోవడం శుభపరిణామమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు