Suryapet : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం..!
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం అయ్యారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Suryapet : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం అయ్యారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం హైదరాబాద్ 365 బి జాతీయ రహదారిపై ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
వోల్వో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో వోల్వో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనం అయినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. కారు నెంబర్ ప్లేట్ కూడా పూర్తిగా కాలిపోవడంతో వివరాలు కూడా గుర్తించడం కష్టంగా మారింది.
సూర్యాపేట రూరల్ ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. టోల్ ప్లాజా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కారులో చిక్కుకొని సజీవ దహనం అయిన వ్యక్తి ఖమ్మం మమత ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.









