Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

దేవరకద్ర లో రూ.134.98 కోట్ల తో నూతన పనులకు మంత్రుల శ్రీకారం..!

మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధికి మరో భారీ అడుగు.. మూడు కీలక మార్గాలకు శంకుస్థాపన గత సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న రోడ్డు సమస్యలను దేవరకద్రలో ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పనులు మంజూరు చేశారు.

దేవరకద్ర లో రూ.134.98 కోట్ల తో నూతన పనులకు మంత్రుల శ్రీకారం..!

మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి లు శంకుస్థాపన

మహబూబ్ నగర్, (మన సాక్షి జిల్లా ప్రతినిధి)

మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధికి మరో భారీ అడుగు.. మూడు కీలక మార్గాలకు శంకుస్థాపన గత సంవత్సరాల నుండి
ఎదురుచూస్తున్న రోడ్డు సమస్యలను దేవరకద్రలో ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పనులు మంజూరు చేశారు.

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చేసిన కృషికి ఫలితంగా ఆదివారం దేవరకద్ర నియోజకవర్గంలో రూ.134.98 కోట్ల విలువైన మూడు కీలక రహదారి పనులకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జిఎంఆర్ కలిసి మినిగోనిపల్లి వద్ద ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.103.54 కోట్లతో కురుమూర్తి మార్గం డబుల్ రోడ్డు, దేవరకద్ర–మినిగోనిపల్లి–గుడిబండ–ముచ్చింతల–తిరుమలాపూర్–దాసర్‌పల్లిగూడూరు మీదుగా కురుమూర్తి స్వామి దేవస్థానం వరకు, అలాగే దేవస్థానం నుంచి వెంకంపల్లి–పేరూరు ముత్యాలంపల్లి– వర్నే వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.103.54 కోట్లు కేటాయించారు.

ఎన్‌హెచ్‌–44 నుంచి దేవరకద్రకు రూ.13.43 కోట్లు జాతీయ
రహదారి–44 నుంచి పొన్నకల్–నందిపేట్జీనుగురాళ్ల–డోకూర్ మీదుగా దేవరకద్ర వరకు రహదారి నిర్మాణం, మరమ్మతులకు రూ.13.43 కోట్లు మంజూరయ్యాయి.

భూత్పూర్–కర్వేన రహదారికి రూ.18.01 కోట్లుభూత్పూర్ చౌరస్తా నుంచి భూత్పూర్–కొత్తమొల్గర–వెలికిచర్ల–భట్టుపల్లి తండా మీదుగా కర్వేన వరకు రహదారి విస్తరణ, మరమ్మతు పనులకు రూ.18.01 కోట్లు వెచ్చించనున్నారు.

రహదారులు బలపడితే అభివృద్ధికి వేగం

ఈ మూడు పనులు పూర్తయితే నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, భక్తులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి దేవస్థానానికి రాకపోకలు సులభతరం కావడంతో ఆలయ అభివృద్ధి, పర్యాటక కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుంది.

ఈ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే జిఎంఆర్, జిల్లా ఎస్పీడీ జానకి, జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్త, వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు