Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో హైవేపై మంటల్లో కాలిపోయిన లారీ..!
నల్గొండ జిల్లాలో హైవేపై లారీ మంటల్లో కాలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Nalgonda : నల్గొండ జిల్లాలో హైవేపై మంటల్లో కాలిపోయిన లారీ..!
మన సాక్షి, చింతపల్లి
నల్గొండ జిల్లాలో హైవేపై లారీ మంటల్లో కాలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే క్యాబిన్ పూర్తిగా మంటల్లో చిక్కుకొని కాలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు దాచేపల్లి మధు, ఆకుతోట జంగయ్య లు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. చొరవ చూపిన స్థానికులను పలువురు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
- Paddy : వరిలో చీడపీడల నివారణకై రైతులు ఇలా చేయాలి..!
- సాయం చేయబోతే ప్రాణమే పోయింది.. నల్గొండ జిల్లాలో ఘటన..!
- Nalgonda : ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ.. 20న టెస్ట్, ఎక్కడెక్కడ అంటే..!
- Suryapet : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం..!









