Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంవ్యవసాయం

పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం..!

రైతులు ఆరుగాలం కష్టం చేసి సాగు చేసిన వరిచేలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం..!

–ఎండిన వరిచేలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

కనగల్ , మన సాక్షి:

రైతులు ఆరుగాలం కష్టం చేసి సాగు చేసిన వరిచేలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలోని తేలకంటిగూడెంలో ఎండిపోయిన వరిచేలను ఆయన పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆలంబిస్తున్న తీరు బాధాకరమన్నారు. కృష్ణా నదికి నీళ్లు వచ్చినా పంటలు ఎందుకు ఎండుతున్నాయని ప్రశ్నించారు. ముందు చూపు లేకుండా ప్రభుత్వం ఉన్నందునే పంటలు ఎండుతున్నాయన్నారు. ఎల్ నినో పేరు చెప్పి ఇంకెంతకాలం రైతులను ఇబ్బందులు పెడతారన్నారు.

ALSO READMiryalaguda : మిర్యాలగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..!

ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులను గోస పెట్టడమేనా అని ప్రశ్నించారు. పంటలు ఎండిపోయి హరి గోస పడుతున్న రైతులకు కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు సమాధానం చెప్పాలన్నారు. ఓ పక్క వర్షాభావ పరిస్థితులు మరోపక్క కరెంటు కష్టాలు రైతులను వెంటాడుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందన్నారు.

ఇందులో రాజకీయాలు అవసరం లేదని రైతులకు మేలు జరగాలన్నదే మా ఉద్దేశం అన్నారు. యాదాద్రి, భద్రాద్రిలో ఉత్పత్తి చేసే కరెంటు యూనిట్లను ఎందుకు బందు పెట్టారో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. కెసిఆర్ హయాంలో రైతులకు రెప్పవాల్చకుండా 24 గంటల కరెంటు ఇస్తే ఇప్పుడు కరెంటు కోతల వాతలు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత చర్యగా అభివర్ణించారు. స్థానిక సబ్ స్టేషన్ లో లాగ్ బుక్కును పరిశీలించి కరెంటు వచ్చి పోయే వేళలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు.

ద్వంద్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కృష్ణా జలాలతో చెరువులు, కుంటలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్ట మల్లికార్జున్రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, గోన రవీందర్ రావు, నల్గొండ మాజీ జెడ్పిటిసి తుమ్మల లింగస్వామి,

ALSO READSuryapet : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుతో పాటు వ్యక్తి సజీవ దహనం..!

కనగల్ నల్లగొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, కార్పొరేటర్లు, మారగొని భవాని గణేష్, పెరికే యాదయ్య, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, రావుల శ్రీనివాసరెడ్డి, రామగిరి శ్రీధర్ రావు, జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, బైరగోని వెంకన్న గౌడ్, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచ్ కారింగు జానయ్య, గుండెబోయిన జంగయ్య, రాము, మర్రి రేణుక, నర్రా నిర్మల, చెనగొని యాదగిరి, చెనగొని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు