రాహుల్, ప్రియాంకలపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష..!
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసుల దాడి, అరెస్టులకు నిరసనగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి గురువారం ముకరంపురలోని తన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు.

రాహుల్, ప్రియాంకలపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష..!
ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం ఆగదు.
ఎన్నికల వ్యవస్థలో అక్రమాలపై కేంద్రం సమాధానం చెప్పాలి.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి.
అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధం.
రాహుల్, ప్రియాంకల పోరాటానికి ప్రజల మద్దతు: నరేందర్‌రెడ్డి
కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసుల దాడి, అరెస్టులకు నిరసనగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి గురువారం ముకరంపురలోని తన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శాంతియుతంగా నిరసన చేపడితే వారిపై పోలీసుల ద్వారా దాడులు, అరెస్టులు చేయించడం సరికాదన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా, ఫారం-6, ఫారం-7కు సంబంధించిన అంశాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Also Read : Black Coffee : బ్లాక్ కాఫీ వల్ల ఎన్ని ప్రయోజనలో.. ఎలా చేయాలి, ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం..!
ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపడుతున్న పోరాటానికి ప్రజల మద్దతు ఉందని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎండీ తాజ్, కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్‌రెడ్డి, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, నిహాల్ అహ్మద్, ఎండీ చాంద్, ముక్క భాస్కర్, లాయక్, షబానా మహమ్మద్, కుర్ర పోచయ్య, ముల్కల కవిత, అస్థాపురం తిరుమల, జ్యోతి రెడ్డి, మహాలక్ష్మి, మిరాజ్, జీడి రమేష్, అస్థాపురం రమేష్, గోనె స్వప్న, జిలకర రమేష్, సాయిరాం, భార్గవి, బషీర్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.









