Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..!

కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..!

కరీంనగర్‌ బ్యూరో, మనసాక్షి:

కరీంనగర్‌లోని మతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మానకొండూర్‌ మండలం రాఘవాపూర్‌కు చెందిన పిట్టల అరుణ్‌–అఖిల దంపతులకు గురువారం కరీంనగర్‌లోని తాత్విక ఆసుపత్రిలో మగబిడ్డ జన్మించాడు.

శిశువు బరువు తక్కువగా ఉండటంతో అదే రోజు శిశువుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సెలైన్స్‌, ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం బాబు గట్టిగా ఏడవడంతో పాలు పట్టించేందుకు తల్లి వద్దకు తీసుకెళ్తున్న సమయంలో శిశువు మృతి చెందినట్లు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆరోపిస్తూ, ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

మరిన్ని వార్తలు