Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణరంగారెడ్డి

రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తాసిల్దార్, సర్వేయర్..!

20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా తాసిల్దార్, సర్వేయర్ చిక్కారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.

రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తాసిల్దార్, సర్వేయర్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా తాసిల్దార్, సర్వేయర్ చిక్కారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక లే అవుట్ కు సంబంధించి సర్వే నివేదిక అందజేసేందుకుగాను 20 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Also Read : Cyber Crime : నో అంటే.. బ్యాంకు ఖాతా ఖాళీ.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ లేఅవుట్ సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే నివేదిక ఇచ్చేందుకు 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చివరికి 20 లక్షల రూపాయలను ఒప్పుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఆదేశాల మేరకు 20 లక్షల రూపాయలను సర్వేయర్ శ్రీనివాస్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Also Read : Nalgonda : నల్గొండలో 108 అంబులెన్స్ సేవలను పరిశీలించిన ఢిల్లీ జాతీయ నాణ్యతా బృందం..!

అనంతరం తాసిల్దార్, సర్వేయర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు