Nalgonda : నల్గొండలో 108 అంబులెన్స్ సేవలను పరిశీలించిన ఢిల్లీ జాతీయ నాణ్యతా బృందం..!
ఢిల్లీ నుండి వచ్చిన జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం (NQAS Team) సోమవారం నల్గొండ జిల్లాలో 108 అత్యవసర అంబులెన్స్ సేవలను క్షేత్రస్థాయిలో ఆడిట్ చేసింది.

Nalgonda : నల్గొండలో 108 అంబులెన్స్ సేవలను పరిశీలించిన ఢిల్లీ జాతీయ నాణ్యతా బృందం..!
నల్గొండ, మన సాక్షి :
ఢిల్లీ నుండి వచ్చిన జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం (NQAS Team) సోమవారం నల్గొండ జిల్లాలో 108 అత్యవసర అంబులెన్స్ సేవలను క్షేత్రస్థాయిలో ఆడిట్ చేసింది.
ఈ కేంద్ర బృందం 108 అంబులెన్స్ లను సందర్శించి, ప్రజలకు అందిస్తున్న అత్యవసర వైద్య సేవల నాణ్యతను పరిశీలించింది.
బృందం పరిశీలించిన ముఖ్య అంశాలు: :
1. అంబులెన్స్ సంసిద్ధత: అంబులెన్స్ పరిస్థితి, ప్రాణాలను కాపాడే మందులు, పరికరాలు – వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్, సక్షన్, ఆక్సిజన్, అత్యవసర మెడిసిన్ కిట్ లభ్యత.
2. సిబ్బంది సామర్థ్యం: మెడికల్, గాయాలు, గర్భిణీ, గుండెపోటు అత్యవసర కేసులను ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించడంలో EMT లు మరియు పైలట్ల పరిజ్ఞానం.
3.డాక్యుమెంటేషన్ & ప్రోటోకాల్స్: PCR రాయడం, రెస్పాన్స్ టైం, ఇన్ఫెక్షన్ కంట్రోల్, బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ, చేతుల శుభ్రత మరియు అంబులెన్స్ డిస్ఇన్ఫెక్షన్ విధానం.
నల్గొండ జిల్లాలోని అన్ని 108 అంబులెన్స్ లు 24 గంటలూ ఉచిత అత్యవసర సేవలు అందిస్తూ, సగటు రెస్పాన్స్ టైం 20 నిమిషాల లోపు ఉండేలా చూస్తున్నాయని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ తెలిపారు.
అంబులెన్స్ ల నిర్వహణ మరియు ప్రాణాలను కాపాడడంలో EMT లు, పైలట్ల అంకితభావం పట్ల జాతీయ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. నాణ్యమైన డాక్యుమెంటేషన్ లో మరింత మెరుగుదలకు కొన్ని సూచనలు చేసింది.
ఈ ఆడిట్ లో జిల్లా అధికారులు, క్వాలిటీ మేనేజర్ మరియు 108 క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.









