సింహాద్రి కాలనీ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.!
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 20వ డివిజన్ సింహాద్రి కాలనీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అభివృద్ధి, కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

సింహాద్రి కాలనీ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.!
అధ్యక్షుడిగా గడ్డం దామోదర్.. ప్రధాన కార్యదర్శిగా గడ్డం నరేష్
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
(కరీంనగర్ బ్యూరో – నరేష్, మన సాక్షి )
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 20వ డివిజన్ సింహాద్రి కాలనీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ అభివృద్ధి, కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శిగా గడ్డం నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.
నూతన కార్యవర్గంలో.. ఉపాధ్యక్షులుగా జె. రాము సింగ్, జి. మల్లేష్, కే. సమ్మయ్య, ఎన్. బద్రి నాయక్; సహాయ కార్యదర్శులుగా గడ్డం విజేందర్, రౌతు శంకర్; కోశాధికారిగా గుంటి మహేందర్; ప్రచార కార్యదర్శిగా జి. వేణు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేశం, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు అస్తపురం మారుతి మరియు కాలనీ వాసులు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు..
నూతన కార్యవర్గం ఎన్నికకు సహకరించిన కాలనీవాసులకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కాలనీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని, కాలనీవాసులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనుల సాధనకు కృషి చేయాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది. కాలనీవాసుల సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాలనీ సమగ్ర అభివృద్ధికి సమష్టిగా పనిచేస్తామని సభ్యులు తెలిపారు.









