జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి
పత్రికలో వార్తా కథనాలు ప్రచురించిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్‌రావు డిమాండ్ చేశారు.

జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి
గంభీరావుపేట ఎస్ఐతో పాటు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్
(కరీంనగర్ బ్యూరో – నరేష్) మనసాక్షి :
పత్రికలో వార్తా కథనాలు ప్రచురించిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్‌రావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు సంపత్, ఎడిటర్ శేఖర్‌లను శుక్రవారం పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ.. గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ వ్యవహారశైలిపై వరుస వార్తా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో జర్నలిస్టులపై ప్రతీకార చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు జరిగాయనే ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సిరిసిల్ల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్లు తీసుకోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఆలస్యంగా అందిందని బాధిత జర్నలిస్టులు తెలిపినట్లు బాపురావు పేర్కొన్నారు.
Also Read : జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి
ఘటనలో ఎక్కడెక్కడ దాడులు జరిగాయి? ఎవరు బాధ్యులు? ఎవరి ఆదేశాలతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలపై స్వతంత్రంగా విచారణ జరిపించాలని ఆయన, గాదె కరుణాకర్‌రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు జరిగాయనే ఆరోపణలపై వాస్తవాలను వెలికితీసి, బాధ్యులుగా తేలిన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోని పక్షంలో జర్నలిస్టులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు గడ్డం నరేష్, శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.