డిండి రైతులకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు.. సీఎండీ హామీ..!
డిండి రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్న రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

డిండి రైతులకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు.. సీఎండీ హామీ..!
రైతుల పంటల రక్షణకు ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక చొరవ
(చింతపల్లి – వెంకట్) మనసాక్షి.
డిండి రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్న రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీ ఎస్ ఎస్పి డీసీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎండీ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన సీఎండీ, అవసరమైన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డిమాండ్ డ్రాఫ్ట్లు డి డి ఎస్ చెల్లించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రైతులకు పెండింగ్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను డీటీర్ ఎస్ వెంటనే విడుదల చేసి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అత్యవసరంగా అదనపు ట్రాన్స్ఫార్మర్లను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో తీవ్ర విషాదం.. రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి.!
డిండి రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడంతో రైతులు బోరు బావులపై ఆధారపడాల్సి వస్తోందని, ఈ సమయంలో విద్యుత్ లోడ్ సమస్యలు ఎదురైతే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే వివరించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా, అవసరమైన చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.
ఎమ్మెల్యే బాలు నాయక్ విజ్ఞప్తిపై సీఎండీ సానుకూలంగా స్పందిస్తూ, రైతుల అవసరాలను పరిశీలించి అవసరమైన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల పంటలను కాపాడేందుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రాధాన్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.









