కెమికల్ కంపెనీలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికుల దుర్మరణం..!
గుజరాత్ లోని బరూచ్ జిల్లాలో జి ఐ డి సి పరిధిలో ఉన్న ఒక కెమికల్ కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ కంపెనీలో హైడ్రోజన్ ప్రక్రియ జరుగుతుండగా ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

కెమికల్ కంపెనీలో భారీ పేలుడు.. ఐదుగురు కార్మికుల దుర్మరణం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
గుజరాత్ లోని బరూచ్ జిల్లాలో జి ఐ డి సి పరిధిలో ఉన్న ఒక కెమికల్ కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ కంపెనీలో హైడ్రోజన్ ప్రక్రియ జరుగుతుండగా ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి రియాక్టర్ ట్యాంకర్ ముక్కలు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..!
మృతులను ఆమోద్ ప్రాంతానికి చెందిన జయదేవ్ మహేష్ బాయ్ పటేల్, భవిక్ దిలీప్ కుమార్, సోమనాథ్ జిల్లాకు చెందిన తలావ్య, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన హరిలాల్ గౌతం, అర్జున్ కుమార్ రాంసింగ్ గౌతమ్ గా గుర్తించారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పేలుడు స్థలానికి చేరుకొని జరుపుతున్నారు.









