Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠా పట్టివేత.. ముగ్గురు నిందితులు అరెస్ట్..!

నారాయణపేట జిల్లా పరిధిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ తెలిపారు.

అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠా పట్టివేత.. ముగ్గురు నిందితులు అరెస్ట్..!

1.4 కిలోల గంజాయి, స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లు, రూ.7,000 నగదు స్వాధీనం

(నారాయణపేట టౌన్ – రమాకాంత్, మనసాక్షి)

నారాయణపేట జిల్లా పరిధిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మక్తల్ పట్టణంలోని రామ్‌లీలా మైదానం వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తూ ఉండగా అటువైపు స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించిందని పోలీసులు మొత్తం 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి తెలిపారు.

అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లు, రూ.7,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.60,000/- ఉంటుందని అంచనా వేశారు. నిందితులకు డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ముగ్గురికీ పాజిటివ్‌గా వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

కర్ణాటక రాష్ట్రం రాయచూర్ కు చెందిన
ఓం అశోక్ కొరాడి,  మహారాష్ట్ర దక్షిణ సోలాపూర్ కు చెందిన రాజశేఖర్ రాంచందర్ హూనరావ్,  ఎం.డి. యాసీన్ బందెనవాజ్ మఖాన్ దార్,  మీరు ముగ్గురు స్కూటీపై వెళుతుండగా రామ్ లీలా మైదానం దగ్గర తనిఖీలు చేస్తుండగా గంజాయి రవాణా చేస్తుండగా మక్తల్ పట్టణ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితులు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, రాయచూర్ మీదుగా మక్తల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాల వెనుక మరికొందరి ప్రమేయం ఉందా, గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు ఎలా సాగుతున్నాయనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మక్తల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, ముఖ్యంగా యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటు పడిన వారు వైద్యులు, నిపుణుల సహాయం తీసుకుని ఆ అలవాటు నుంచి బయటపడాలని కోరారు.

Also Read : Suryapet : అర్ద రాత్రి ఉలిక్కి పడిన కుటుంబం.. ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం..!

జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మక్తల్, టాస్క్ ఫోర్స్ పోలీసులకు అభినందనలు ::

డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో సమర్థవంతంగా నిఘా ఏర్పాటు చేసి, గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన మక్తల్ సీఐ రామ్ లాల్, మక్తల్ ఎస్‌ఐ రాజు, టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ పురుషోత్తం, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ అభినందించి రివార్డును అందజేశారు.

మరిన్ని వార్తలు