Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవాని భక్తులు మృతి..!
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు భవాని భక్తులు మృతి చెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవాని భక్తులు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు భవాని భక్తులు మృతి చెందారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి నేషనల్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో భవాని భక్తులు టీ తాగడానికి దిగారు. కాగా భక్తుల పైకి ఒక స్కార్పియో వాహనం అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం.. భర్తను హత్య చేసిన భార్య..!
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.









