జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 17 క్రికెట్ సెలక్షన్లో శశిధర్ ఎంపిక
ఎస్జిఎఫ్ అండర్ 17 బాలుర విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ జట్టుకు జోగిపేట అవెంజర్స్ క్రికెట్ అకాడమీకి చెందిన పి. శశిధర్ ఎంపికైనట్లు కోచ్ శివకుమార్ తెలిపారు.

జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 17 క్రికెట్ సెలక్షన్లో శశిధర్ ఎంపిక
ఆందోలు, మన సాక్షి :
ఎస్జిఎఫ్ అండర్ 17 బాలుర విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ జట్టుకు జోగిపేట అవెంజర్స్ క్రికెట్ అకాడమీకి చెందిన పి. శశిధర్ ఎంపికైనట్లు కోచ్ శివకుమార్ తెలిపారు. గురువారం స్థానిక హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం పట్ల జోగిపేట సీఐ అనిల్ కుమార్ అతనిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
Also Read : కేబినెట్లో కూర్చుంటే రైతుల కష్టాలు అర్థం కావు.. బి.వి. రాఘవులు
ఈనెల 17న పటాన్చెరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన సెలక్షన్స్ లో లెగ్ స్పిన్నర్‌గా చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల 26న గద్వాల్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి ఆడనున్నారు. రాబోవు రోజుల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఖచ్చితంగా ఎంపిక అవుతారని కోచ్ శివ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.








