TG News : రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది అరెస్ట్..!
తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కష్టం మిల్లింగ్ (సీఎంఆర్) సరఫరా లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సి ఐ డి నేర పరిశోధన విభాగం అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగారు.

TG News : రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది అరెస్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కష్టం మిల్లింగ్ (సీఎంఆర్) సరఫరా లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సి ఐ డి నేర పరిశోధన విభాగం అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సిఐడి బృందాలు ఇప్పటివరకు 150 మందికి పైగా రైస్ మిల్లర్లను అరెస్టు చేసినట్లు సమాచారం.
ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన సిఐడి అధికారులు ఆయా జిల్లాలలో మెరుపు దాడులు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా పరిధిలో నలుగురు రైస్ మిల్లర్ల యజమానులను, ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు జిల్లాలలో తనిఖీలు నిర్వహించి సుమారు 150 మంది రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వం కష్టం మిల్డింగ్ కోసం కేటాయించిన ధాన్యానికి సంబంధించి నిబంధనలు ప్రకారం కాకుండా నాణ్యమైన బియ్యం కాకుండా దొడ్డు బియ్యం సరఫరా చేశారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల మేర నష్టం కలిగించారని అభిప్రాయాలు సైతం ఉన్నాయి.
ఆయా అభియోగాలపై సిఐడి దర్యాప్తు జరుపుతుంది. ఈ భారీ కుంభకోణం వెనుక ఇతర అధికారులు వ్యాపారుల పాత్ర పై కూడా లోతుగా విచారణ జరుగుతుంది.









