Breaking Newsక్రైంజాతీయం

Air India plane Crash : గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం.. కుప్ప కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్..!

Air India plane Crash : గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం.. కుప్ప కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాద సంఘటన జరిగింది. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా జనావాసాల్లో కుప్పకూలింది. విమానంలో 242 మంది ఉన్నట్లు సమాచారం. విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగలు వ్యాపించాయి. అహ్మదాబాదులో విమానం టేక్ ఆఫ్ కాగానే కుప్పకూలింది.

సంఘటన స్థలానికి సహాయక బృందాలు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విమానం వెనుక భాగం చెట్టును ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. విమాన ప్రమాద సంఘటన వల్ల కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి కి ఫోన్ చేసినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, ఇద్దరు పైలట్లు పదిమంది సిబ్బంది 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఒకరు కెనడా, ఏడుగురు పోర్చుగీసు దేశస్థులు ఉన్నారు. విమానం కూలింది మెడికల్ కళాశాల క్యాంటీన్ పై కూలినట్లు తెలుస్తుంది మధ్యాహ్నం సమయం కావడంతో మెడికోలు లంచ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 20 మందికి పైగా మెడికల్ మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!

  2. Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!

  3. Singer Mangli : చిక్కుల్లో సింగర్ మంగ్లీ.. బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం..!

  4. TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

https://twitter.com/Kshatriyadilip/status/1933083790613614977?t=7mvN8BCE-mTMFO7W0UklhQ&s=19

మరిన్ని వార్తలు