మిర్యాలగూడ : డబ్బుల కోసం.. ఆ ఐదుగురు ముఠాగా..!

చెడు అలవాటులకు బానిసలై తమ అవసరాలకు కావలసిన డబ్బుల కోసం తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలు చేస్తున్న ముఠాను ఆదివారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ పి వెంకట గిరి తెలిపిన వివరాల ప్రకారం.. 

మిర్యాలగూడ : డబ్బుల కోసం.. ఆ ఐదుగురు ముఠాగా..!

దురలవాట్లకు బానిసలై దొంగతనాలు
70 వేల విలువగల సామాన్లు, ఒక టాటా ఏసీ స్వాధీనం

మిర్యాలగూడ, మన సాక్షి:

చెడు అలవాటులకు బానిసలై తమ అవసరాలకు కావలసిన డబ్బుల కోసం తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలు చేస్తున్న ముఠాను ఆదివారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ పి వెంకట గిరి తెలిపిన వివరాల ప్రకారం..

మండలంలోని అవంతిపురం గ్రామంలో జూలై 10వ తేదీ రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న అమర వెంకటరావు ఇంట్లో తాళం పగలగొట్టి రెండు ఫ్రిజ్లు, రెండు ఇన్వెర్టర్లు, ఒక కంప్యూటర్, చేతి గడియారాలు, వెండి కుందులు, పట్టు చీరలు, సెల్ ఫోన్లు దొంగతనం చేశారు.

కాగా ఈ విషయమై క్రైమ్ నెంబర్ 155/ 2023 గా నమోదు చేయబడి విచారణ జరుగుతుండగా నేటి ఉదయం ఆలగడప టోల్గేట్ వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను పరిశీలిస్తున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఒక ఆటోలో లభ్యమైన ఇంటి సామాగ్రిని చూసి జూలైలో జరిగిన చోరీకి సంబంధించినవిగా గుర్తించి ఆటోలో ఉన్న వ్యక్తులను విచారించగా వారు నేరాన్ని అంగీకరించారని తెలిపారు.

ALSO READ : నల్గొండ : మాడుగులపల్లి నుంచి సినీ ఫక్కిలో పరార్.. వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కోట్ల కొద్ది కట్టల పట్టివేత..!

ఈ మేరకు దొంగతనాలకు పాల్పడ్డ ఐదుగురు యువకులు నర్సింగ్ గంగాధర్,కొంచెం ప్రశాంత్, పట్టేటి హేమంత్,ఈర్ల మల్లేష్, పాతకోటి బుజ్జిబాబు లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

తురితెగతిన చోరీ కేసును చేదించి పూర్తిగా దొంగిలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్న మిర్యాలగూడ గ్రామీణ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహను కానిస్టేబుల్ శ్రీనివాస్ ను డిఎస్పి అభినందించారు.

ALSO READ : Brs B form : 51 మందికే బీఆర్ఎస్ బీఫామ్ లు.. కవితకు బీఫామ్ అందజేసిన కేసిఆర్, షాక్..!