TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

అతి ఎక్కువ మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్. ఇది వినియోగదారుల భద్రతతో పాటు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ మరింత దగ్గరవుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ గ్రూప్ కంటెంట్ కు మరింత భద్రతను అందించనున్నది. దీనివల్ల వాట్సాప్ వినియోగదారులకు చాలా ఉపయోగం ఉంటుంది.

వినియోగదారులు వారి సందేశాలు, మీడియా ఫైల్స్ ను మరింతగా నియంత్రణ కల్పించేందుకు ఆన్‌లైన్ చాటింగ్ యాప్ వాట్సాప్ “అడ్వాన్స్ చాట్ ప్రైవసీ ఫీచర్” ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వల్ల వినియోగదారుల చాట్ లోని సందేశాలను, మీడియా ఫైల్స్ ను ఎక్స్ పోర్ట్ చేయకుండా ఆటో డౌన్ లోడ్ చేయకుండా, ఏఐ సంబంధిత సాధనాల కోసం సందేశాలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది.

ఇది అత్యంత గోపికకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారుల అవసరాల కోసం ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. అయితే గ్రూప్ మెసేజ్ లకు మరింత భద్రత కల్పించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చాట్ సెట్టింగ్స్ లో అడ్వాన్స్ చాట్ ప్రైవసీ ఆప్షన్ ద్వారా దీన్ని మాన్యువల్ గా ఎనేబుల్ చేయవచ్చు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత చాట్ లో పాల్గొనే వారందరికీ పరిమితులు వర్తిస్తాయి. గ్రూపులోని కంటెంట్ వాట్సప్ లోనే ఉండేలా చూసుకుంటుంది.

Similar News : 

  1. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

  2. WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

  3. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

  4. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

మరిన్ని వార్తలు