Andol : పాముకాటుకు విద్యార్ధిని మృతి..!
Andol : పాముకాటుకు విద్యార్ధిని మృతి..!
అందోలు, మనసాక్షి :
జోగిపేటలోని కృష్ణవేణి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న పిట్ల నవ్య (10) ఆదివారం పాముకాటుకు గురై మరణించింది. పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పిట్ల లక్ష్మన్ సోదరుడైన శ్రీనివాస్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు నవ్యకు ఇంట్లోనే పాము కరవడంతో మద్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జోగిపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు వెంటనే యాంటీ స్నేక్ వినమ్ ఇంజక్షన్ చేసారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రి వర్గాలు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసారు. సంగారెడ్డి ఆసుపత్రికి చేరుకున్న పది నిమిషాల్లోనే బాలిక మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. బాలిక నవ్యకు నాగుపాము కాటు వేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
బాలిక మృతితో పట్టణంలోని ఇందిరానగర్, 3వ వార్డులో విషాధఛ్చాయలు అలుముకున్నాయి. ప్రతి రోజు తోటి పిల్లలతో సరదాగా ఆడుకునే చిన్నారి మృత్యువాతకు గురికావడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
MOST READ :









