Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లాహైదరాబాద్

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా..!

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా..!

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 స్టేట్ జనరల్ సెక్రెటరీ శ్రీధర్

చింతపల్లి, మన సాక్షి :

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగల శ్రీధర్ అన్నారు.

ఆదివారం హనుమకొండ లోని పల్ల రవీందర్ రెడ్డి భవన్లో ట్రాన్స్కో యూనిట్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ట్రాన్స్కో లో అపరిష్కృతగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం, ప్రభుత్వం,దృష్టికి తీసుకెళ్తానని వారు పేర్కొన్నారు. సిడిబి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం దృష్టి సారించాలన్నారు.

సిపిడి గ్యాంగ్ ప్రయాణించే వాహనంలో కూర్చునే విధంగా సౌకర్యం లేకపోవడం వల్ల వెన్నుపూస సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు పనిచేసే చోట కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 327 యూనియన్ చేసిన సేవలు మరువలేమ్మాన్నారు..

ట్రాన్స్కో లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ట్రాన్స్కో సీఎం డి తో చర్చించి వాటిని పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది . ప్రైవేటీకరణ విషయంలో ప్రతి ఉద్యోగి ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. సంస్థ బాగుంటేనే ఉద్యోగుల మనుగుడా సాధ్యం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుందని ఆయన దుయ్యపట్టారు.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, ఉద్యోగ సంఘాలు ఏమిటో చూపిస్తామని వారు హెచ్చరించారు. అవసరమైతే దేశవ్యాప్తంగా ఉద్యోగులు అందరు కలిసి మెరుపు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిఉద్యోగులకు సూచించారు. సంస్థ మునగడ కోసం ప్రతి ఉద్యోగి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులుకు ఎల్లవేళలో అందుబాటులో ఉండి వాటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపారు.

అనంతరం ట్రాన్స్కో యూనిట్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుడుగా రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్ ఎన్నికల అధికారులుగా ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా స్టేట్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి. రమేష్ లు వ్యవహరించారు.

నూతన కార్యవర్గం

ట్రాన్స్కో అధ్యక్షులుగా డి. ఎం శ్రీనివాస్, రాస్కో సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గా, విజయ మారియా, వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ మురళి, ఎం శ్రీనివాస్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ ఇ.మధుకర్, టి అశోక్, కే శ్రీధర్, పి మల్లేష్, ఇ.రాఘవేంద్ర, ఏ.రాజు , ట్రాన్స్కో సెక్రటరీ ఆర్ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ టి.శ్రీనివాస్ డి శ్రీనివాస్ రెడ్డి, మైస రాజు, ఎం ఆర్ ఆర్ .శివ, ఇమ్మానియేల్,

ఆర్గనైజేషన్ సెక్రటరీ, జి.రజిత, ఎం.రాజు, జె శ్రీనివాస్, నీల రవికుమార్, షర్మిల, ట్రెజరర్ గా సంకోజు, రామకృష్ణ ఆఫీస్ సెక్రటరీ కవిత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రాన్స్కో సెక్రటరీ రమేష్ యాదవ్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ధనికుల సదయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ చింతలపూడిసతీష్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!

  2. Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!

  3. Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  4. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

మరిన్ని వార్తలు